ఇంకెన్నాళ్లు బాబు నీ మోసాలు

అమలుగాని హామీలిచ్చి మోసం
తూర్పుగోదావ‌రి(మండ‌పేట‌): గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండ‌ల ప‌రిధిలోని ఏడిద‌లో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య చౌద‌రి ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అమ‌లు కానీ హామీల‌ను ఇచ్చి చంద్ర‌బాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌ు ఎందుకు అంద‌జేయ‌డం లేద‌ని ఆయన బాబును ప్ర‌శ్నించారు. రామ‌య్య చౌదరి వెంట పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శి రాధాకృష్ణ‌(రాజుబాబు), పార్టీ నేత కొవ్వూరి త్రినాథ‌రెడ్డిలున్నారు. 


డ్వాక్రా రుణాల ఊసేలేదు
కాకినాడ టౌన్‌(బోట్‌క్ల‌బ్‌):  డ్రెయిన్‌లో పూడిక తీయ‌క‌పోవ‌డం వ‌ల్ల నిత్యం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నామ‌ని, డ్వాక్రా రుణాలు ఇవ్వ‌డం లేద‌ని డివిజ‌న్‌లోని ప‌లువురు వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల వ‌ద్ద వాపోయారు. వైయ‌స్సార్‌సీపీ సిటీ కోఆర్డినేట‌ర్ ముత్తా శ‌శిధ‌ర్ ఆధ్వ‌ర్యంలో స్థానిక 27వ డివిజ‌న్‌లోని బుడంపేట‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ‌శిధ‌ర్ మాట్లాడుతూ.... చంద్రబాబు రెండేళ్ల‌పాల‌న‌కు మీరే మార్కులు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ప్రతీ ఒక్కరూ టీడీపీ పాలనపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.  

న‌మ్మించి న‌ట్టేట ముంచాడు
అన‌కాప‌ల్లి: ఎన్నిక‌ల‌కు ముందు హామీల వ‌ర్షం కురిపించి అధికారంలోకి వ‌చ్చాక న‌ట్టేట ముంచార‌ని అన‌కాప‌ల్లి 18వ వార్డు గ‌వ‌ర‌పాలెం ప్ర‌జ‌లు బాబుపై దుమ్మెత్తిపోశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్సీపీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. అమ‌ర్నాథ్ వెంట శ్రీ‌నివాస్‌, అప్పారావు, రామ‌చంద‌ర్‌, నాగేశ్వ‌ర్‌, త్రినాధ్‌, శివ‌, రామ‌కృష్ణ‌, నూక‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

చినుకు ప‌డితే చిత్తడే!
ముమ్మిడివ‌రం:  డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా ఉండ‌డంతో చిన్న‌పాటి వ‌ర్షానికే ర‌హ‌దారులు చెరువుల్లా మారుతున్నాయ‌ని మండ‌లంలోని ల‌చ్చిపాలెం ప్ర‌జ‌లు వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లంద‌రు క‌ష్టాల పాల‌య్యార‌ని  ఆరోపించారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సీఎం అయితేనే ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరుతాయ‌ని పేర్కొన్నారు. 

Back to Top