ఎంతకాలం మోసం చేస్తారు

విశాఖపట్నం: అమలుకు నోచుకొని హామీలిస్తూ ఎంతకాలం మోసం చేస్తారంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు. తూటిపాల శివారు మామిడిపాలెం, అడిగర్లపాలెం, పోతలూరు గ్రామాల్లో సోమవారం గడపగడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు.  గణేష్‌ మాట్లాడుతూ... చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతా గమనిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ నాటి సువర్ణయుగం మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆర్‌.సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు చిటికెల రమణ, బొడ్డు గోవిందరావు, తూటిపాల సర్పంచ్‌ గవిరెడ్డి ప్రసాదరావు, పార్టీ నేతలు పెట్ల భద్రాచలం, వ్రరి పాత్రుడు, లక్కరాజు రాజారావు, బండారు సత్యన్నారాయణ, రుత్తల రాజు, బూషనం, కార్యకర్తలు పాల్గొన్నారు.


Back to Top