ప్రజలను మోసగించినందుకు తగిన ఫలితం అనుభవిస్తాడు

పత్తికొండః టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా తమకు సంక్షేమ పథకాలేవీ అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ సి. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం గువ్వలకుంట్లలో జరిగింది. రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ నెల ఒకరిని తొలగిస్తూ రేషన్ బియ్యంలో కోత విధిస్తున్నారని స్థానికులు వైయస్సార్సీపీ నేతల వద్ద మొరపెట్టుకున్నారు. బాబును నమ్మి ఓటేసిన పాపానికి తమకు తగిన శాస్తి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడని, వాటిని ప్రశ్నించిన వైయస్ జగన్ ను ఇబ్బందులు పెడుతున్నాడని నారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేసిన బాబు తగిన ఫలితం అనుభవిస్తాడని అన్నారు.


Back to Top