బతిమాలి ఓటేయించుకొని ప్లేటు ఫిరాయిస్తున్నారు

రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం మున్సిపాల్టీలోని 15వ వార్డులో గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిన తీరును కాపు రామచంద్రారెడ్డి  ప్రజలకు వివరించి, వంద ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని అందించారు. కాలనీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని శివలింగమ్మ, నాగరాజు తెలిపారు. ఇళ్ల మంజూరు గురించి అడిగితే నిర్లక్ష్య సమాధానాలు చెప్పడంతో పాటు , నీవేమీ ఊరకనే ఓటేశావా? మేము ఓటేయమని అడిగామా అంటూ టీడీపీ కౌన్సిలర్‌ మాట్లాడుతున్నారని జుబేదాబేగం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇళ్లకు వచ్చి బతిమాలి ఓటు అడిగారు. గెలిచిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

హాజరైన నాయకులు: వైయస్సార్సీపీ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి,  రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి,  బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప,    ఎస్సీ  సెల్‌ రాష్ట్రకార్యదర్శి బీటీపీ గోవిందు , జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి,  జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మహేష్, పట్టణ అధ్యక్షులు నభీష్, మండల కన్వీనర్‌ మల్లికార్జున, ప్రధాన కార్యదర్శులు పైతోట సంజీవ, అబ్బాస్, అంపణ్ణ,  కౌన్సిలర్లు పేర్మి బాలాజి,‡ గోనబావి శర్మస్, నాయకులు కొత్తపల్లి సత్యానారాయణ రెడ్డి, చాంద్‌భాష, బేలోడు రామాంజినేయులు, ఆనంద్, పవన్, రఘు, మంజునాథ తదితరులు హాజరయ్యారు. 
 
Back to Top