బాబుకు ప‌ట్ట‌భ‌ద్రులు త‌గిన గుణ‌పాఠం చెప్పారు

విశాఖః రాష్ట్రంలో అవినీతి ప‌రిపాల‌న చేస్తున్న చంద్ర‌బాబుకు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విద్యావేత్త‌లు, మేధావులు త‌గిన గుణ‌పాఠం చెప్పార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం క‌న్విన‌ర్ కోల గురువులు ధ్వ‌జ‌మెత్తారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 21వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కోల గురువులు ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు దోపిడీ ప‌రిపాల‌న‌ను వివ‌రించారు. ఎన్నిక‌ల ముందు అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని మండిప‌డ్డారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు మాణిక్యాల‌రావు, జాన్‌వెస్లీ, ష‌రీఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top