హామీల అమలులో ప్రభుత్వం విఫలం

వైయస్‌ఆర్‌ జిల్లా

: ఎన్నికలకు ముందు చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి, తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అందర్ని నమ్మించి మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలోని నారాయణరెడ్డిపల్లె గ్రామంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌  కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా ఎమ్మెల్యే పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.  గత రెండు  సంవత్సరాలుగా  బోరు మోటరు చెడిపోయి  తాగు నీటి  కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొండావాండ్లపల్లె బీసీ కాలని వాసులు  ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన శ్రీకాంత్‌రెడ్డి వెంటనే మోటర్‌కు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, వివిధ సంక్షేమ ఫలాలు   పచ్చచొక్కా  వేసు కొన్నవారికే  అందిస్తున్నారని,  సామన్య ప్రజల సమస్యలను  పట్టించు కోలేదని ఎమ్మెల్యే ఆగ్రహం  వ్యక్తం చేశారు. మన సమస్యలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఇక కష్టాలు తొలగిపోతాయని భరోసా కల్పించారు.

Back to Top