సామాన్యులను పట్టించుకోని సర్కార్..పెల్లుబికిన ప్రజాగ్రహం

తూ.గో.జిల్లాః పి.గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. గృహ నిర్మాణ రుణాలను టీడీపీ వాళ్లకే మంజూరు చేస్తున్నారని, సామాన్యులను పట్టించుకోవడం లేదని చిట్టిబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇంటి రుణం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని, ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలున్నా పెన్షన్ ను నిలిపేశారని పలువురు వికలాంగులు, వితంతువులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని రుణాలను మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చిట్టిబాబు హెచ్చరించారు. 


Back to Top