ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

తూర్పుగోదావరి))మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ పట్టణంలోని గొల్లపుంత కాలనీలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి గోతులమయం కావడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. ఇళ్ల నిర్మాణాలకు పూర్తిస్థాయిలో బిల్లులు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్లు, పింఛన్లు తదితర సమస్యలను లీలాకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల అమలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిందని ఎద్దేవా చేశారు.


తాజా ఫోటోలు

Back to Top