మత్స్యకారులను ఆదుకోవడంలో సర్కార్‌ విఫలం

శ్రీకాకుళం:

తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు మత్స్యకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ మండిపడ్డారు. మత్స్యకారులను ఆదుకోవడంలో సర్కార్‌ విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. సోంపేట మండలంలోని గొల్లగండి పంచాయతీలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాజ్‌ ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వివరించి టీడీపీ పాలనపై గ్రామస్తులతో మార్కులు వేయించారు. గ్రామానికి చెందిన 25 మంది టీడీపీ కార్యకర్తలు సాయిరాజ్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, జిల్లా కార్యదర్శి మడ్డు రాజారావు, మాజీ సర్పంచ్‌ దండాసి, నాయకులు బుద్దేశ్వరరావు, కోదండ, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.


Back to Top