ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

కందుకూరుః ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మన్వ‌య‌క‌ర్త తూమాటి మాధ‌వ‌రావు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఉల‌వ‌పాడు మండ‌లం ఆత్మ‌కూరు గ్రామంలోని ఎస్సీ కాల‌నీ, కుమ్మ‌రి శెట్టి పాలెంలో ఇంటింటికి తిరుగుతూ ప్ర‌జా బ్యాలెట్‌ను అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ...తెలుగుదేశ  ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. దివంగ‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజ్యం రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.


Back to Top