ప్రజల గోడు పట్టని సర్కార్

‘గడపగడపకూ వైయ‌స్ఆర్‌’లో నేతల వద్ద ప్రజల ఆక్రందన
స్థానిక సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు
భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న నేతలు

తూర్పుగోదావరి(రాజమండ్రి): ‘అర్హత ఉన్నా పింఛను రావడంలేదు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల బిల్లులు ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగు రోడ్లపై పారుతోంది.’ పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఉన్న సమస్యలను ప్రజలు తమ వద్దకు వచ్చిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల దృష్టికి తీసుకువస్తున్నారు. ఎన్నిక‌ల‌ వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు తీరు, రెండేళ్ల పాలనలో చంద్రబాబు దగా, అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుంచేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ‘గడపగడపకూ వైయ‌స్ఆర్‌’ కార్యక్రమం  జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందియ.

గుంతలమయమైన రోడ్లతో అల్లాడుతున్నామని, అధ్వానంగా ఉన్న పారిశుధ్యం కారణంగా తాము రోగాల బారిన పడుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని స్థానిక నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా, చివరికి తమ గోడు అరణ్యరోదనైందని ప్రజలు  వైయ‌స్ఆర్‌ సీపీ నేతల వద్ద వాపోతున్నారు. తమ సమస్యలు ఆలకించేందుకు వస్తున్న నేతలను ప్రజలు వాడవాడలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈసందర్భంగా నేతలు వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పి.గన్నవరం మండలం, సామర్లకోట మండలం,  మండపేట నియోజకవర్గాల‌లో ‘గడపగడపకూ వైయ‌స్ఆర్‌’కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
Back to Top