ఎన్నికల హామీల అమ‌లులో విఫ‌లం

చిత్తూరు(గంగాధరనెల్లూరు): చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి మండిప‌డ్డారు. గురువారం  మహదేవమంగళం, మహదేవమంగళం దళితవాడ, రామిరెడ్డికండిగ, బాలిరెడ్డికండిగ గ్రామాల్లో ఎమ్మెల్యే నారాయణస్వామి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంటింటా ప‌ర్య‌టించి ప్రజాసమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మహదేవమంగళంలో సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటికి అవస్థలు పడుతున్నామన్నారు. నూతనంగా బోరు వేసి తాగునీటి సమస్య తీర్చాలన్నారు. గడచిన అయిదు సంవత్సరాల క్రితం ఆర్టీసి బస్సు వచ్చేదని ఇప్పుడు బస్సు రావడంలేదన్నారు. రోడ్డు బాగలేదనే నెపంతో బస్సు ఆపేశారని ప్రస్తుతం తారురోడ్డు ఉందన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. వీదిలైట్లు వెలగడం లేదన్నారు. దీంతో రాత్రి వేళల్లో పాములబెడద ఎక్కువగా ఉందని ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. పూమణి, తాయారమ్మ వితంతు పించన్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మంజూరు చేయలేదన్నారు. పొన్నురంగం మాట్లాడుతూ వికలాంగపించన్‌ఇవ్వడంలేదన్నారు. అనేకమంది మహిళలు ఇళ్ళ నిర్మాణాల కోసం నిదులు మంజూరు చేయాలని కోరారు.

Back to Top