హామీలకు మంగళం

విశాఖపట్నంః పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ విమాన్ నగర్, కాకానినగర్ తదితర ప్రాంతాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం లేదని స్థానికులు విజయప్రసాద్ కు మొరపెట్టుకున్నారు. రహదారి నిర్మించాలని విమాన్ నగర్ వాసులు విన్నవించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మళ్ల స్థానికులకు హామీ ఇచ్చారు. బాబు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు కరపత్రాలు అందించి మార్కులు వేయించారు. బాబు సర్కార్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయని బాబుకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు.


Back to Top