గడపగడపకూ విశేష ఆదరణ

విజయనగరం(సాలూరు): టీడీపీ ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్  కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.ఇప్పటి వరకు సాలూరు పట్టణ పరిధిలోనున్న 1,2,3,4,5,8వార్డుల్లో పర్యటించామని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు వైయస్సార్సీపీని అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. 

 ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా అని ప్రశ్నిస్తే అందరూ లేదనే బదులిస్తున్నారన్నారు. ప్రధానంగా  చాలామంది వితంతువులు పింఛన్ మంజూరుకాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. వికలాంగులది సైతం అదే పరిస్థితి ఉందన్నారు. చాలామంది తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు ఐరిష్ పడడంలేదని, తమకు బియ్యం ఇవ్వడంలేదని చెబుతున్నారన్నారు.  ప్రభుత్వం  దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. 
Back to Top