నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు

కె.కోటపాడు : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌తో అన్ని వ‌ర్గాల‌కు మేలు క‌లుగుతుంద‌ని పార్టీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి వెంకటేష్ అన్నారు. మండలంలో సూదివలస, గొల్లలపాలెం గ్రామాల్లో వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రిగా అయిన తరువాత అమలు చేసే నవరత్నాల సంక్షేమ పధకాలను ఆయా గ్రామాల్లో ప్రజలకు వివరించి వారికి కరపత్రాలను అందించారు.   కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఈర్లె గంగునాయుడు(నాని), మాజీ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, కిలపర్తి నాయుడు, యాళ్ళ నాగేష్, గుడివాడ నాయుడు, పల్లా రాజేష్, పల్లా రాజుబాబు తదితరులు పాల్గోన్నారు.

...................................
విస్త్రృతంగా నవరత్నాలపై ప్రచారం  
నాతవరం: మండలంలో రాజుపేట ఆగ్రహరం గ్రామంలో వైయ‌స్ఆర్ కుటుంబ కార్యక్రమాన్ని బుధవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలశాఖ బిసి సెల్ కార్యదర్శి గుడపర్తి అచ్చియ్యనాయుడు ఆధ్వ‌ర్యంలో నిర్వహించారు . వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల‌పై ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితే అన్ని వర్గాలు వారికి మేలు జరుగుతుందన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్ నువ్వా రాజులు బూత్ కమిటి సభ్యులు నర్సింహమూర్తి నాయుకులు ఉన్నారు. 
..............................................
ఉత్సాహంగా  వైయ‌స్ఆర్‌ కుటుంబం 
మునగపాక: మండల వ్యాప్తంగా వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. గ్రామాల్లోని బూత్ క‌మిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రచారం  చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబునాయుడు మోసాలను వివరిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన‌ నవరత్నాల ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. మండలస్థాయి నేతలు, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు ప్రతీరోజూ ఉత్సాహంగా పాల్గొంటూ వైయస్సార్ కుటుంబంలో పలువురిని చేర్పిస్తున్నారు.ప్రధానంగా 9121091210 నంబర్లకు మిస్డ్ కాల్స్ ఇప్పిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతీ ఇంటికీ వెళ్లి పార్టీ తర పున ప్రచారం చేసేందుకు బూత్ క‌మిటీ సభ్యులు సైతం ముందుకువస్తున్నారు. గంటవానిపాలెంలో ఎంపీటీసీ పల్లెల ప్రకాశరావు, బూత్కమిటీ సభ్యులు నందారపు భాస్కరరావు, కన్నబాబు, రమణ, ముత్యాల భాస్కరరావు తదితరులు ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే మునగపాకలో 7 వవార్డు మెంబర్ మళ్ల కృష్ణ బూత్కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు.
 ---------------------------
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి 
గొలుగొండ: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి పేద ప్రజల ఆశాజ్యోతి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు పలకాలని పార్టీ సీనియర్ నాయకులు సుర్ల గిరిబాబు కోరారు.  చీడిగుమ్మల గ్రామంలో బుదవారం వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు నవరత్నాలుపై ప్రచారం చేసారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహనరెడ్డి సిఎం అయితేనే పేద ప్రజలకు బాగుంటుందని, అందుకే వైయ‌స్ఆర్‌ కుటుంబంలోనికి చేరాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కసిరెడ్డి సత్యన్నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Back to Top