పెచ్చుమీరుతున్న జన్మభూమి క‌మిటీల ఆగ‌డాలు


ప్రజా బ్యాలెట్ ద్వారా టీడీపీ ప్రభుత్వ తీరును ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త నాగేశ్వ‌ర‌రావు తెలిపారు.

గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆయన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్పందన తెలుసుకొన్నారు.

ప‌థ‌కాల మంజూరులో రాజ‌కీయ వివ‌క్ష చూపుతూ వృధ్దులు, మ‌హిళ‌లు, వితంతువులకు ఫించ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు.

జ‌న్మ‌భూమి క‌మిటీలు చేసే ఆగ‌డాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయ‌ని ఎల‌మంచిలి మండ‌లం రుక్మిణీపురంకు చెందిన రైతు మ‌ల్లేశం అన్నారు.

Back to Top