దిగ్విజయంగా గడపగడపకూ కార్యక్రమం

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మునగపాక మండలం పురుషోత్తపురం లో గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు, విశాఖ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ విజయప్రసాద్ 66వ వార్డులో పర్యటించారు.  ప్రజలను వంచిస్తున్న టీడీపీ బాగోతాలను గడపగడపలో ఎండగట్టారు. 


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గోనెగండ్ల పట్టణంలో గడపగడపలో పర్యటించారు. అదేవిధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంఛార్జ్ డా. రామలింగారెడ్డి రుద్రవరం మండలం అప్పనపల్లెలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు బాబు సర్కార్ పై పోరాడుదామని పిలుపునిచ్చారు. 


నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య  నాయుడుపేట మండలం శ్రీనివాసపురంలో  ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాబు చేస్తున్న మోసాలను వివరించారు. మోసపూరిత ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ జగన్ సీఎం అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయని వారిలో భరోసా కల్పించారు. 

Back to Top