కర్నూలులో గడపగడపకూ వైయస్సార్సీపీ శ్రేణులు

కర్నూలుః జిల్లాలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో ప్రతీ గడపలో పర్యటిస్తున్నారు. టీడీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే సమస్యలన్నీ తీరిపోతాయని వారిలో భరోసా కల్పిస్తున్నారు.
మరోవైపు, బనగానపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ కాటసని రామిరెడ్డి మనగం పేట గ్రామ పంచాయితీలో ఇంటింటికి వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో రామిరెడ్డితో పాటు జిల్లా కార్యదర్శి సిద్ధా రెడ్డి రామ్మోహన్ రెడ్డి,  జిల్లా బీసీ సంఘం కార్యదర్శి రాంబాబు, అవుకు మండల కన్వీనర్ మల్లిఖార్జున రెడ్డి, జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి  మహ్మదర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 


Back to Top