గడపగడపకూ వైయస్సార్సీపీ శ్రేణులు

విశాఖపట్నం: ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జన బాహుళ్యంలోకి దూసుకెళుతున్న ‘గడప గడపకూ  వైయస్సార్సీపీ కార్యక్రమం  జిల్లా అంతటా విజయవంతంగా సాగుతోంది. పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి, వారి కష్ట సుఖాలు తెలుసుకొని మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. జగనన్న పాలన వస్తే సమస్యలు తీరుతాయని వివరిస్తున్నారు. సీతంపేట 35వ వార్డు ప్రశాంతినగర్, సంజీవయ్య కాలనీల్లో విశాఖ-ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్, నగర మహిళాధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ర్ట నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, సిటీ ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్‌అలీ పర్యటించారు.

అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. కె.కోటపాడు మండలంలోని లంకవానిపాలెం, పిండ్రంగి గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమాన్ని  నిర్వ‌హించారు.  తమ ఉనికిని టీడీపీ సర్కార్ దెబ్బకొడుతోందని మండిపడ్డారు. టీడీపీ అక్రమంగా బాక్సైట్ తవ్వేందుకు సిద్ధపడినపుడు వైయస్సార్సీపీ  అండగా నిలిచిందని అన్నారు. చింతపల్లి, పాడేరు జెడ్పీటీసీలు కె.పద్మకుమారి, బి.నూకరత్నం, జీకే వీధి ఎంపీపీ బాలరాజు పాల్గొన్నారు.
Back to Top