గడపగడపలో మేమున్నామంటూ భరోసా

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతీ గడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రెండేళ్ల కాలంలో బాబు చేసిన వంచనను పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ ఇంఛార్జ్ అశోక్ సింగరాయకొండ మండలం, పాకాల గ్రామంలో గడపగడపలో పర్యటించారు. బాబు మోసాలను ఎండగట్టారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గం పేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపగడకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మల్లేపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గడపగడపలో బాబు మోసపూరిత పాలనను ప్రజలకు వివరించారు. అదేసమయంలో వారి సమస్యలు తెలుసుకుంటూ...అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటిని తప్ప నెరవేరుస్తారని వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యాల శ్రీనివాస్ సమక్షంలో పెద్ద ఎత్తున మల్లేపల్లి గ్రామంలోని టీడీపీ నేతలు వైయస్సార్సీపీలో చేరారు. 


Back to Top