మహోద్యమంలా గడపగడపకూ కార్యక్రమం

గడపగడపలో వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డా. సుధీర్ రెడ్డి  గడపగడపలో పర్యటించారు. ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. బాబు మోసపూరిత పాలనను ప్రజలకు వివరించారు.  ప్రజాసమస్యలు గాలికొదిలి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్న బాబు సర్కార్ ను సాగనంపుదామని పిలుపునిచ్చారు.  మరోవైరు, రైల్వో కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రతీ గడపకు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు.        


ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాకుళంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, ఎమ్మెల్యే కళావతి గడపగడపలో వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంతో ఇంటింటికి వెళ్లారు. ప్రజల కష్టాలు తెలుసుకొంటూ ముందుకు సాగారు. వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే మన కష్టాలన్నీ తీరిపోతాయని వారికి భరోసానిస్తున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్, 45వ వార్డు ప్రెసిడెంట్ నాగేశ్వర్ రావులు ఏకేసీ కాలనీలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల హామీలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించి సమాధానాలు రాబట్టారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు సున్నా మార్కులు వేశారు. 

Back to Top