ప్రశ్నార్థకంగా పేద ప్రజల మనుగడ

అంటురోగాలతో అల్లాడుతున్నాం
రాజమహేంద్రవరం)) రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి ముందు మురుగు నీరు నిల్వ ఉండి దోమలతో అంటురోగాల బారిన పడుతున్నామని హుకుంపేట, నాగిరెడ్డినగర్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలో వైయస్సార్‌సీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్సార్‌ సీపీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక సమస్యలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు పాలన ఘోరంగా వైఫల్యం చెందిందని వీర్రాజు ఆరోపించారు. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని..వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యలన్నీ తొలగిపోతాయని  ప్రజలకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కార్పొరేషన్ కు నిధులివ్వకపోతే ఉద్యమిస్తాం
నెల్లూరు))నెల్లూరు నగరంలోని 5వ డివిజన్‌ బొడిగాడితోట, అరవపాలెం, బర్మాషాల్‌గుంట ప్రాంతాల్లో ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ ఒబిలి రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయకుండా ప్రచారంతో కాలక్షేపం చేస్తుందని ఆరోపించారు. నగరంలో పెద్ద ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఉన్నప్పటికీ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్‌ అన్యాయం చేస్తుందన్నారు. కార్పొరేషన్‌కు ఎక్కువగా నిధులు పన్నుల రూపంలో వస్తున్నాయని, ఆయా నిధులను నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలు అన్ని పార్టీల నాయకులను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

పాలకుల నుంచి స్పందన కరువు
కృష్ణా)))కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలోని అయ్యవారిరుద్రవరం గ్రామంలో మండల కన్వీనర్‌ గుమ్మడి వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో 72వ రోజు గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమన్వయ్యకర్త దూలం నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు ఆయన దృషికి తీసుకొచ్చారు. తాగునీటి చెరువు సమీపంలో చేపలు, రొయ్యల చెరువులు సాగు చేయడం వలన మంచినీరు కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా పాలకుల నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. అనంతరం డీఎన్నార్‌ మాట్లాడుతూ... టీడీపీ హయాంలో పేద ప్రజలకు మనుగడ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top