హామీలు నెరవేర్చేవరకు పోరాడుదాం

టీడీపీ పాలనలో దగపడిన ప్రజలకు కొండంత అండగా నిలుస్తూ వైయస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లిన వైయస్సార్సీపీ నేతలకు బొట్టుపెట్టి, హారతి ఇచ్చి ప్రజలు ఆత్మీయస్వాగతం పలుకుతున్నారు. ప్రతీ గడపలోనూ ప్రజలు తమ కష్టాలను వైయస్సార్సీపీ నేతలకు చెప్పుకొని ఆవేదన చెందుతున్నారు.

 

బాబుకు ఓట్లేసి మోసపోయామని పశ్చాతాప పడుతున్నారు. రుణాలు మాఫీ కాలేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగభృతి లేదు. చంద్రబాబు వచ్చాక పింఛన్లు అందడం లేదని ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నారు. మహానేత వైయస్సార్ పాలన స్వర్ణయుగమని తలచుకుంటున్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటేనే తమ కష్టాలు తీరుతాయని విశ్వసిస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయితి, ఐటిఐ కాలనీలో నిర్వహించిన గడపగడపకూ వైయ‌స్ఆర్ సీపీ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త  వరికూటి అమృతపాణి పాల్గొన్నారు.  బాబు పాల‌న నుంచి త్వ‌ర‌లోనే జ‌గ‌న‌న్న ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పిస్తారు" అని ఈసందర్భంగా ఆమె పేర్కొన్నారు. మరోవైపు దేశాయిపేట పంచాయితి, లోహియపురం, దంతంపేట  లో నిర్వహించిన గడపగడపకూ వైయ‌స్ఆర్ సీపీ కార్యక్రమంలో యడం బాలాజీ పాల్గొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని త‌మ పార్టీ ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వంతో పోరాడుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు.


Back to Top