ప్రజావ్యతిరేక సర్కార్ పై పోరాటం

శ్రీకాకుళంః జిల్లాలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. తమ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సర్కార్ తీరును ఎండగడుతూ నేతలు ముందుకు సాగుతున్నారు.  నరసన్నపేట నియోజకవర్గం పోలాకి  మండలం ఉర్జాం గ్రామ పంచాయతీ లో  గడప - గడపకు వైయస్ఆర్ (106వ రోజు,85వ పంచాయతి) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసారు 

మరోవైపు, టెక్కలి నియోజకవర్గo నాంబళ్ల పేట, పిఠాపురం, మోదుగవలస గ్రామలలోనియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం జరిగింది. టీడీపీ అవినీతి, అక్రమ పాలనను పార్టీ నాయకులు గడపగడపలో ఎండగట్టారు. 

Back to Top