బాబు గుండెల్లో గుబులు

జైలుకు పంపుతామ‌న‌డం అన్యాయం
శ్రీ‌శైలం(బండిఆత్మ‌కూరు):  ప్ర‌త్యేక హోదా కోసం పోరాడే విద్యార్థుల‌ను జైలుకు పంపిస్తామ‌న‌డం సీఎం చంద్ర‌బాబు దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని ఈర్న‌పాడు, ఎరుక‌ల‌కాల‌నీ గ్రామాల్లో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోసాల‌ను వివ‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం అలుపులేని పోరాటం చేస్తున్నార‌న్నారు. ప్ర‌త్యేక హోదా కోసం విద్యార్థుల‌తో ప‌లు చోట్ల హోదా అవ‌శ్య‌క‌త గురించి చ‌ర్చా వేదిక ఏర్పాటు చేయ‌డంతో బాబుకు గుబులు మొద‌లైంద‌న్నారు. 


విస్త‌ర‌ణ పేరుతో అన్యాయం
కాకినాడ‌: ర‌హ‌దారి విస్త‌ర‌ణ పేరుతో న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హరించారు. క‌నీసం నోటీసు కూడా ఇవ్వ‌కుండా దౌర్జ‌న్యంగా నివాసంలోని అధిక భాగాన్ని తొల‌గించారు. న‌ష్ట‌ప‌రిహారం కానీ, బాండ్లుకానీ ఇవ్వ‌లేదంటూ జ‌గ‌న్నాథ‌పురం భ‌వ‌న్నార‌య‌ణ సెంట‌ర్ ప్రాంత వ్యాపారులు వైయ‌స్సార్ సీపీ సిటీ కోఆర్డినేట‌ర్ ముత్తా శ‌శిధ‌ర్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌పగ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప‌ట్ట‌ణంలోని ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... టీడీపీ మాట‌ల ప్ర‌భుత్వ‌మే కానీ, చేత‌ల ప్ర‌భుత్వం కాద‌ని ఎద్దేవా చేశారు. 

పొదుపు రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీలు
క‌ర్నూలు(క‌ల్లూరు): ఎన్నిక‌ల ముందు డ్వాక్రా రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని చెప్ప‌డంతో కంతులు చెల్లించ‌లేదు. అధికారంలోకి వ‌చ్చాక క‌ల్ల‌బొల్లిమాట‌లు చెబుతూ మోసం చేశారు. ఇప్పుడేమో బ్యాంకు వాళ్లు చ‌క్ర‌వ‌డ్డీలు వేశారు. ఎలా చెల్లించేది. ఇలాంటి సీఎంను ఎన్న‌డూ చూడ‌లేదంటూ పొదుపు మ‌హిళ‌లు ఫ‌ర్జానా, మ‌దార్‌బీ, నాగ‌ల‌క్ష్మీ త‌దిత‌రులు ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి స‌మ‌క్షంలో త‌మ గోడును వెల్ల‌బొసుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్యక్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే 30వ వార్డు బ‌ద్రినాథ్ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. చంద్ర‌బాబు పాల‌నకు కాలం చెల్లింద‌ని ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి బాబు పాల‌న‌పై ధ్వ‌జ‌మెత్తారు. 


Back to Top