నవరత్నాల సభతో వైయస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం

–ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అధ్యక్షతన రాయచోటిలో జరిగిన నవరత్నాల సభకు విశేష స్పందన
రాయచోటి రూరల్‌ : వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుంటూరు ప్లీనరీ సమావేశంలో ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్‌ కమిటీ సభ్యులను సన్నధ్దం చేసే ప్రయత్నంలో రాయచోటి గురువారం నిర్వహించిన నవరత్నాల సభకు విశేష స్పందన లభించింది. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, బూత్‌ కమిటీ సభ్యుల్లో ఈ సభ ద్వారా వారి ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డిలు హాజరైన సభలో మొదటగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ... తానే స్వయంగా బూత్‌ కమిటీల్లో పేరు నమోదు చేసుకుని గుండెల మీద వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి బ్యాడ్జి, భుజం మీద కండువా వేసుకోగానే కండరాలు ఉబికాయని, శరీరమంతా వైయస్‌ ప్రేమతో పొంగిందన్నారు. అదే ఉత్సాహంతో సభను నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, చిత్తశుద్దితో పని చేసి, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ మెజార్టీతో వైయస్సార్‌సీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన చెప్పారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్దికి సహకరిస్తూ, రాయచోటిలో కేంద్ర యూనివర్సిటీ మంజూరుకు కృషి చేసి, అదేవిధంగా రాయచోటిలో ఉర్దూ కళాశాలలు వచ్చేందుకు కృషి చేసిన ఎంపీ మిథున్‌రెడ్డికి ఈ సంధ్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు నాయకులు వారి అభిప్రాయాలను కూడా సభలో వెల్లడించారు.

ఎన్నికల కోసం వైయస్సార్‌సీపీ శ్రేణులు కసిగా ఎదురు చూస్తున్నారు : గడికోట ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఓటు ద్వారా చంద్రబాబు పాలనకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ శ్రేణులు, ఓటర్లు ఎన్నికల కోసం కసిగా ఎదురు చూస్తున్నారు. నంద్యాల ఎన్నికల్లో అధికార మదం, ప్రలోభాలతోనే టీడీపీ గెలిచిందన్న విషయం అందరికీ తెలుసు. అదే విదంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకోవడం సిగ్గు చేటు. అది జరగని పని. ప్రజలకు ఎన్నో రకాలుగా మేలు చేసిన వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు  జగన్‌ను ఈ సారి రాష్ట్ర ప్రజలు తప్పకుండా సీఎంను చేస్తారు. అందుకు బూత్‌ కమిటీలు నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని తుంగలో తొక్కి, వైయస్సార్‌ కుటుంబానికి, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను.

వైయస్‌ పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాయి : గడికోట మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి అడిగిన వెంటనే అన్ని పథకాలు ఇచ్చారు. ఆయన పాలనాకాలంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాయి. ప్రతి పల్లెకు తారు రోడ్డులు వేశారు. ప్రాజెక్టులు రైతుల కోసం కట్టించారు. నిధులు కేటాయించి అభివృద్ది చేశారు. రాయచోటి పట్టణానికి తాగునీటిని అందించారు. ఆయన కుటుంబానికి మనం రుణపడి ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేసుకోవాలి. మన ఎమ్మెల్యే, ఎంపీలను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మూడున్నర ఏళ్ల పాలనా కాలంలో టీడీపీ చేసిందేమీ లేదు. ఆ విషయం మనం ప్రజలకు తెలియజేయాలి. నవరత్నాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలి.

ఉత్సాహంగా పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్దం కావాలి : పి.దేవనాథ రెడ్డి, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌
ఉప ఎన్నికల్లో ఒడిపోయినంత మాత్రాన కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహ పడకూడదు. అధికార పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచే సంధర్భాలు చూస్తున్నాము. నంద్యాలలో ప్రలోభాలకు గురి చేసి, వందల కోట్లు ఖర్చు చేసి టీడీపీ గెలిచింది. అయినా 70వేల ఓట్లు వైయస్సార్‌సీపీకి పడ్డాయని సంతోషిద్దాం. భవిష్యత్‌ మనదే. వచ్చే ఎన్నికలకు ఉత్సాహంగా పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరుకుంటున్నాను. ప్రజలను భయభ్రాంతులను  చేసి గెలిచేది కూడా ఒక గెలుపేనా..? ప్రజలకు మేలు చేకూరే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు బూత్‌ కమిటీ సభ్యులు అందరూ కష్టపడి పని చేయాల్సి ఉంది .

పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేయాలి : పోలు సుబ్బారెడ్డి, మండల కన్వీనర్‌ ,రాయచోటి
ఎటువంటి వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేసి వారి వారి స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి. పార్టీ అభివృద్దికి కృషి చేసే కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో విలువ ఉండాలి. పార్టీకి ద్రోహం చేసే వారిని వీలైనంత దూరం కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జగన్‌ పాదయాత్రలో మరిన్ని అంశాలను అందులో చేర్చి, జగన్‌ను సీఎం చేసుకోవాలని కోరుతున్నాను.

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఆవుల విష్ణువర్థన్‌ రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌
వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ ఆదేశానుసారం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా పని చేసి, బూత్‌ కమిటీల ద్వారా ప్రతి ఇంటికి నవరత్నాలు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ప్రజల్లో అవగాహన రావడం వల్లనే పార్టీ అభివృద్ది చెందుతుంది. ఆ విదంధంగా చేసుకుని పార్టీలో అవసరమైన సంస్థాగత మార్పులు తీసుకురావాలి. బూత్‌ కమిటీలకు పార్టీ నాయకుల సహకారం ఎంతైనా అవసరం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కుని , ఎక్కువ శాతం ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. జగన్‌ను సీఎంగా చేసుకోవాలి .

అధికార పార్టీ బెదిరింపులకు బెదిరేదే లేదు : పి.మదన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి
ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతున్న అధికార టీడీపీకి బెదిరేదే లేదు. వైయస్సార్‌సీపీ సూచించిన సూచనల మేరకు ముందుకు సాగుదాం. ఒక్క నంద్యాలలో బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకున్నంత మాత్రాన రాష్ట్రంలో అందరూ భయపడతారని టీడీపీ భ్రమలో ఉంది. అది ఏ మాత్రం సాద్యం కాదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలంలో 52సార్లు ఉప ఎన్నికలు జరగితే ఒక్క సారి కూడా టీడీపీ గెలవలేకపోయిందని ఆ పార్టీ నాయకులు గుర్తుపెట్టికోవాలి. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డిని మరో సారి అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు నిరంతరం శ్రమిస్తాం.

రాయచోటికి వైయస్‌ చేసిన మేలు ఎవరూ మరిచిపోరు : నషీబున్‌ఖానం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
రాజశేఖర్‌ రెడ్డి రాయచోటికి చేసిన మేలు ఎవరూ మరిచిపోరు. తాగడానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు శ్రీకాంత్‌ రెడ్డి అడగ్గానే వెలిగల్లు నుంచి రాయచోటికి తాగడానికి నీళ్లు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా ఆయన కొడుకు జగన్‌మోహన్‌ రెడ్డిను ఖచ్చితంగా సీఎం చేసుకునే విధంగా కష్టపడాలి. రాయచోటిలో మళ్లీ ఎమ్మెల్యేగా శ్రీకాంత్‌ రెడ్డిని అత్యధి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరూ కష్టపడి పని చేయాలి.

కష్టపడి పని చేస్తే ఫలితాలు సాధించవచ్చు : ఎం. కంచంరెడ్డి, వైయస్సార్‌సీపీ నాయకులు
రాష్ట్రంలో ఎక్కడో ఒక ఆసెంబ్లీ స్థానంలో ఓడిపోయామని భయపడాల్సిన పని లేదు. పార్టీ శ్రేణులంతా కష్టపడి పని చేసి, వైయస్సార్‌సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి.  అందుకు ప్రజలకు అందరికీ అవగాహన కలిగే విధంగా నవరత్నాలను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలను కోరుకుంటున్నాను. కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Back to Top