అంతా ప్రచార ఆర్భాటమే

ప్ర‌త్యేక హోదాతోనే ప్ర‌గ‌తి
క‌ర్నూలు:  ప్ర‌త్యేక హోదా సంజీవ‌నిలాంటిద‌ని, దాన్ని సాధించుకుంటేనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌ఫీజ్‌ఖాన్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప‌ట్ట‌ణంలోని 47వ వార్డులో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వానికి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేద‌ని, కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాల కోస‌మే త‌ప్ప ప్ర‌జ‌ల కోసం అధికార ప్ర‌భుత్వం ప‌ని చేయ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌
పాణ్యం(క‌ల్లూరు):  రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అర్బ‌న్ ప‌రిధిలోని 21వ వార్డు సిండికేట్ బ్యాంకు కాల‌నీలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జా బ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత విధానాలను ఎండగట్టారు. అనంత‌రం చ‌రితారెడ్డి మాట్లాడుతూ.... గ‌త రెండున్న‌రేళ్లుగా చంద్ర‌బాబు పాల‌న  పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.  

Back to Top