జాబు లేదు, ఇళ్లు లేవు అంతా మోసం

అధికారం కోసం అబద్ధపు హామీలు
విజ‌య‌న‌గ‌రం(పార్వ‌తీపురం):  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచిరోజులు రావాలంటే దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న రావాల‌ని... అది కేవ‌లం ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడే సాధ్య‌మ‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త జ‌మ్మాన ప్ర‌స‌న్న‌కుమార్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న డోకిశీల‌, బుచ్చింపేట‌, చ‌లంవ‌ల‌స గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని, కొత్త ఇళ్లు మంజూరు చేస్తార‌ని, పాత ఇళ్ల‌కు బిల్లులు చెల్లిస్తార‌ని న‌మ్మి ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 

బాబుకు తగిన బుద్ధి చెప్పండి
విశాఖజిల్లా(యలమంచలి))ఎన్నికల హామీలను తుంగలో తొక్కి సీఎం చంద్రబాబు నయవంచక పాలన చేస్తున్నాడని చినకలవాలపల్లి వాసులు మండిపడ్డారు. వైయస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు చినకలవలాపల్లిలో గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాబ్యాలెట్ ను అందజేసి చంద్రబాబు మోసాలను వివరించారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలు గుప్పించి ప్రజలను మోసం చేస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు ప్రగడ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 
Back to Top