స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్న గ‌డ‌ప‌లు

కందుకూరు: నియోజ‌క‌వ‌ర్గంలో ఏ గ‌డ‌పకు వెళ్లినా స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ తూమాటి మాధ‌వ‌రావు అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఉల‌వ‌పాడు మండ‌లంలోని చాకిచ‌ర్ల, పెద్ద ప‌ట్ట‌ప్పుపాలెంలో మాధ‌వ‌రావు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌లు వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను మాధ‌వ‌రావు దృష్టికి తీసుకొచ్చారు. చంద్ర‌బాబు చేతిలో మోస‌పోయిన ప్ర‌జానికానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా నిలుస్తోంద‌ని భ‌రోసా క‌ల్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ వృద్ధుల‌కు, విక‌లాంగుల‌కు ఇచ్చే పెన్ష‌న్ కూడా టీడీపీ స‌ర్కార్ స‌క్ర‌మంగా అంద‌జేయ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లంద‌రూ స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌న్నారు. అధికారులు దృష్టికి తీసుకెళ్లి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధంగా కృషి చేస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటే స‌మ‌స్య‌ల‌న్నీ శాశ్వ‌తంగా ప‌రిష్కారం అవుతాయ‌ని చెప్పారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు శ్రీ రామాల సింగారెడ్డి,  గూడ్లురు జడ్పీటీసీ శ్రీ వెంకట్రామి రెడ్డి, కన్వీనర్ చంద్ర,  కందుకూరు రూరల్ యూత్ అధ్యక్షులు శ్రీ పొడపాటి కోటేశ్వరరావు, సురేశ్, మాల్యాద్రి, సోమయ్య, చిన్న తిరుపతి, జయరాం, గ్రామప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Back to Top