గడప గడపకూ, మనిషి మనిషికీ నవరత్నాలు

–– నంద్యాలలో టీడీపీ గెలుపు కాదు, బలుపు
–– పార్టీకి బూత్‌కమిటీలు కీలకం
–– ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

వాల్మీకిపురంః పీలేరు నియోజకవర్గంలోని ప్రజలు అందరికీ గడప గడపకూ, మనిషి మనిషికీ నవరత్నాలు చేరుతాయని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం వాల్మీకిపురంలో సీతారాం టాకీస్‌లో వాల్మీకిపురం, గుర్రంకొండ, కలకడ మండలాలకు చెందిన బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్ళి వాటి గురించి ప్రజలకు క్షుణంగా వివరించాల్సిన బాధ్యత బూత్‌ కమిటీలదే అన్నారు. అదేవిధంగా నంద్యాల గెలుపు, టీడీపీకి బలుపు అనుకుంటే పొరపాటేనని, 2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం కచ్చితమన్నారు. నంద్యాల, కాకినాడలలో గెలుపు టీడీపీకి ఉపసమనం మాత్రమేనన్నారు. జగన్‌ సీఎం అవ్వగానే నవ్యాంధ్రకు నవరత్నాలు తీసుకొస్తాడని, ఇంటింట ఆనందాన్ని నింపుతాడన్నారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పడని, ఆయన బిడ్డగా మన జగనన్న సైతం ఇచ్చిన మాట కోసం మడమ తిప్పడన్నారు. పేదవాడికి, విద్యార్థికి, మహిళలకు, రైతులకు, యువతకు, కార్మికుడికి ఇలా ఒకరేటంటి అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేందుకు జగన్‌ సిద్ధంగా ఉన్నాడని, రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఆయనకు ఇస్తే తానేంటో జగన్‌ నిరూపించుకుంటాడని ఎమ్మెల్యే స్పష్టం చేశాడు. గత ఎన్నికల కంటే పీలేరు నియోజకవర్గంలో 2019లో రెట్టింపు మెజార్టీతో వైయస్సార్‌సీపీ గెలిచే విధంగా ప్రతి కార్మికుడు సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైయస్సార్‌సీపీ అధికారంలోకి రావాలంటే ఇందులో కీలక పాత్ర బూత్‌కమిటీ సభ్యులతో పాటూ, కార్యకర్తలేదన్నారు. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే మన కష్టాలు తీరుతాయని, మనతో పాటు పేదల కష్టాల తీరిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అరుణమ్మ, హరిత, నక్కా చంద్రశేఖర్, జెడ్పీటీసీలు శ్రీవల్లి, జయరామచంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ చింతల శివానందరెడ్డి, నాయకులు హారిష్‌రెడ్డి, వంగిమళ్ళ మధుసూధనరెడ్డి, గుడిబండ రవి, రాజగోపాల్‌రెడ్డి, జమీర్‌అలీఖాన్, రంగన్న, రమేష్‌రెడ్డి, శ్రీరాములురెడ్డి, శ్రీధర్‌రాయల్, పురుషోత్తం రెడ్డి, మల్లికార్జున స్వామి, జగన్నాథరెడ్డి, వెంకట్రమణారెడ్డి, ముత్యార్‌అలి తదితరులు పాల్గొన్నారు.
Back to Top