ఎన్నికల హామీలకు ఎగనామం

తూర్పుగోదావరి(పి.గన్నవరం))ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలకు ఎగనామం పెట్టిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని వైయస్సార్సీపీ సీజీసీ సభ్యుడు చిట్టబ్బాయి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు పిలుపునిచ్చారు. గంగలకుర్రులో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి బాబు మొహం చాటేశారని యువకులు మండిపడ్డారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటే నమ్మి ఓట్లేశాం. పైసా మాఫీ చేయకుండా మోసం చేశారని మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెడున్నరేళ్లయినా ఇళ్లస్థలాలు, ఇంటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం లేదని, బాబు మాటలు నమ్మి అప్పుల పాలయ్యామని పలువురు తమ ఆవేదనను వెళ్లగక్కారు.


Back to Top