న‌వ‌ర‌త్నాల‌తోనే న‌వ‌స‌మాజ నిర్మాణం

పిఠాపుపురం(రాజ‌మండ్రి) :

కులమత వర్గరాజకీయాలు అతీతంగా అన్ని వర్గాలకు ల‌బ్ధి చేకూరే విధంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్రకటించిన నవరత్నాల పథ‌కాలతోనే నవసమాజ నిర్మాణం జరుగుతుందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జిల్లా అధ్య‌క్షుడు కుర‌సాల కన్నబాబు అన్నారు. స్థానిక రాజావారి కోటలో ఉన్న రెడ్డిరాజా కల్యాణ మండపంలో శుక్రవారం నవరత్నాల ప‌థ‌కాల‌ను  ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు అధ్య‌క్ష‌త‌న  బూత్‌ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆచరణకు సాధ్యంకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు లా కాకుండా ఆచరణకు సాధ్య‌మ‌య్యే ప‌థ‌కాలే ఈనవరత్నాలన్నారు. ప్రజలందరికి ఆర్ధిక, ఆరోగ్య, విద్య, వైద్య, రైతు సంక్షేమం అందేలా రూపొందించిన నవరత్నాల ప‌థ‌కాలు  ప్రజలకు వివరించాల్సిన బాధ్య‌త  ప్రతీ కార్యకర్తకు ఉందన్నారు. పార్టీ రాష్ట్ర యువజనవిభాగం అధ్య‌క్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతు నవరత్నాల ప‌థ‌కాలు ఇప్పటికే అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయన్నారు.

Back to Top