కేపీ దొడ్డి గ్రామంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

అనంతపురం:  గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో  బుధవారం  గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 10.00 గంటలకు కార్యక్రమం ప్రారంభం అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు  230 గడపలు తిరిగారు.  ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిన తీరును మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  ప్రజలకు వివరించి,వంద ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని అందించారు.  అర్హత వున్నా రేషన్‌ కార్డులు, ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయలేదని, గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వుందని బొమ్మక్క, సునందమ్మ, రాధమ్మ, రేవణ్ణ, శివలింగ తదితరులు వాపోయారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప,    ఎస్టీసెల్‌ రాష్ట్రకార్యదర్శి భోజరాజు నాయక్,    ఎస్సీ  సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు ,    మండల కన్వీనర్‌  కాంతారెడ్డి, రాయదుర్గం మాజీ ఎంపీపీ నాగరాజరెడ్డి,  కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి,  పాల్గొన్నారు.

Back to Top