కావలిలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

కావలి : పట్టణంలోని 10వ వార్డులో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్సార్‌కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొంటారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Back to Top