అంబాపురంలో గడపగడపకు వైయస్సార్సీపీ

రాయదుర్గంః కణేకల్లు మండలం అంబాపురం గ్రామంలో శుక్రవారం (నేడు) ఉదయం గడపగడపకు వైయస్సార్సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్‌ ఆలూరు చిక్కణ్ణ తెలిపారు. వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Back to Top