పాంచాళవరంలో గడప గడపకూ వైయస్ఆర్

పాంచాళవరం (అమృతలూరు) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ప్రజా బ్యాలెట్‌ కోరడానికి బుధవారం అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రాపర్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top