అమరవిల్లిలో నేడు గడపగడపకూ వైయస్సార్‌

కొత్తపల్లి : గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం అమరవిల్లిలో నిర్వహించనున్నట్లు వైయస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌ తెలిపారు. కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. పార్టీ శ్రేణులు హాజరు కావాలని వారు కోరారు.

Back to Top