బ్రహ్మసముద్రంలో గడపగడపకూ వైయస్సార్‌

బ్రహ్మసముద్రంః మండల కేంద్రమైన బ్రహ్మసముద్రంలో శనివారం వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ మండల కన్వీనర్‌ రామాంజినేయులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమానికి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు హాజరవుతారని పేర్కొన్నారు. వైయస్సార్‌సీపీ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top