పెదపూడిలో గడపగడపకూ వైయస్ఆర్ కార్యక్రమం

అనపర్తి: మండలం కేంద్రమైన పెదపూడిలో మే 1వ తేదీన గడప గడపకూ వైయ‌స్సార్ కార్యక్రమాన్ని నిర్వహించనన్నుట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. అనపర్తిలో ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గ్రామంలో గడప గడపకూ వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top