ఉప్ప‌ల‌గుప్తంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

తూర్పుగోదావ‌రి: ఉప్పలగుప్తం మండలంలో బుధవారం, గురువారం గడప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం జరుగుతుందని పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ మంగళవారం తెలిపారు. బుధవారం చినగాడవిల్లిగ్రామంలోను, గురువారం పెదగాడవిల్లి గ్రామాల్లో పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలు ముఖ్యఅతిధిలుగా హజరవుతారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హజరుకావాలని బాబ్జీ కోరారు.

Back to Top