మౌలిక సదుపాయలు కల్పించడంలో సర్కార్‌ విఫలం

తూర్పుగోదావరి: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్‌ఆర్‌సీపీ అమలాపురం ఇన్‌చార్జ్‌ పినిపే విశ్వరూప్‌ మండిపడ్డారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, శింగరాయపాలెంలో గురువారం గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వరూప్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి  260 గడపలకు పైగా వెళ్ళి్లపార్టీ కరపత్రాలు, ప్రజా బ్యాలెట్‌ పంపిణీ చేశారు. 250 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో శివారుప్రాంతం అభివృద్దికి దూరంగా ఉందని, సరైన రోడ్డు మార్గం, తాగునీరు సరఫరా లేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెప్పారు. పక్కా గృహలు లేవని ,ఇంటి స్ధలాలు, రుణాలు మంజూరు లేదని, పిఛనులు మంజూరు చెయ్యడం లేదని మొరపెట్టుకున్నారు. 

తాజా వీడియోలు

Back to Top