పసుమర్రులో గడపగడపకు కార్యక్రమం

చిలకలూరిపేట రూరల్‌: మండలంలోని పసుమర్రులో గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల‌ అధ్యక్షుడు చాపలమడుగు గోవర్ధన్‌ తెలిపారు.  గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిల‌దీయ‌నున్న‌ట్లు చెప్పారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌ అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌రుకావాల‌ని కోరారు.

Back to Top