బాధిత కుటుంబానికి సాయం అందజేత

ఐ.పోలవరం: కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు వైయస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ. టి.కొత్తపల్లి గ్రామం అరుంధతి నగర్‌లో పుత్ర వియోగంతో, అనారోగ్యంతో బాధపడుతున్న మందపల్లి బాలయ్య, ఆయన కుటుంబ సభ్యులను సోమవారం గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమంలో బాలకృష్ణ పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. బాలయ్యకు రూ.2వేల అర్థికసాయాన్ని బాలకృష్ణ అందజేశారు. ఆయనవెంట మండల వైెయస్సార్‌ సీపీ కన్వీనర్‌ పిన్నంరాజు వెంకటపతిరాజు (శ్రీను), బళ్ల వెర్రబ్బాయి, తదితరులు ఉన్నారు.

Back to Top