రామాంజనేయపురంలో గడపగడపకూ వైయస్‌ఆర్‌

గుంటూరు: బెల్లంకొండ మండలంలోని రామాంజనేయపురం గ్రామంలో మంగళవారం గడపగడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు చింతారెడ్డి సాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ కావటి శివ నాగ మనోహర్‌ నాయుడు పాల్గొంటారని ఆయన అన్నారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను వివరిస్తారని యంపీపీ చెన్నపురెడ్డి పద్మావెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

Back to Top