మరోసారి మోసపోవద్దు

కర్నూలు(డోన్))రాజధాని పేరుతో దేశాలు తిరుగుతూ చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. బేతంచర్లలో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4వ వార్డులో ఇంటింటికి వెళ్లి బాబు మోసపూరిత పాలనపై మార్కులు వేయించారు. మహానేత వైయస్ఆర్ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమందికి పునర్జన్మనిచ్చిందని, అలాంటి పథకానికి చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజలు అధికారం కట్టబెడితే వారి సంక్షేమం కృషి చేయాలే తప్ప ఇబ్బందులకు గురిచేయకూడదని బాబుకు హితవు పలికారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజల ఇబ్బందులు పడుతున్నా బాబు అవేమీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఒకసారి మోసపోయారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.


Back to Top