పేదలపై వివక్ష చూపడం తగదు

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...అనేక సంవత్సరాలుగా  రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ఈప్రాంతానికి అవసరమైన కనీస వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

నిధులు కేటాయింపులో కార్పొరేషన్ వివక్ష చూపడం తగదన్నారు. నగరానికి అన్యాయం చేస్తే దీక్ష చేస్తానని హెచ్చరించారు. అదేవిధంగా ఇక్కడ 700 మంది పేద కుటుంబాలున్నాయని, ఇంతవరకు వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం దారుణమ్న్నారు. కాలనీవాసులకు వాటిని మంజూరు చేసేవిధంగా కృషిచేస్తానని అన్నారు. 54వ డివిజన్ కు 400 పింఛన్లు రావాల్సి ఉండగా కేవలం 10మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 
Back to Top