సంక్షేమ పథకాల అమలులో వివక్ష

కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో విపక్ష పాటిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో బుడ్డా శేషారెడ్డి గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు కావడం లేదని బుడ్డాకు ఫిర్యాదు చేశారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ..రెండేళ్లు ఓపిక పడితే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, మన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, ముంతల విజయభాస్కర్‌రెడ్డి, జయరామిరెడ్డి, ఇలియాస్‌ఖాన్, బాలస్వామి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top