బాబు వ‌ల్లే ఇబ్బందులు

ప్ర‌కాశం: చ‌ంద్ర‌బాబు మోసపు హామీల‌తో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐవీరెడ్డి విమ‌ర్శించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని బేస్తావారిపేట మండ‌లం బ‌సిన‌ప‌ల్లె గ్రాయ పంచాయ‌తీ ప‌రిధిలో ఐవీరెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టైనా నెర‌వేర్చారా అని స్థానిక ప్ర‌జ‌లను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం బాబు మోసాల‌పై ప్ర‌చురించి ప్ర‌జాబ్యాలెట్‌ను ఇంటింటికీ పంచుతూ చంద్ర‌బాబు చేస్తున్న అవినీతి ప‌రిపాల‌న‌ను వివ‌రించారు. ఐవీరెడ్డి మాట్లాడుతూ రాజ‌ధాని పేరుతో తెలుగుదేశం స‌ర్కార్ ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డింద‌ని మండిప‌డ్డారు. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌ను అర్హుల‌కు అంద‌కుండా చేస్తున్నార‌ని చెప్పారు. రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చేతుల్లో మోస‌పోయిన ప్ర‌జ‌లు ఆయ‌న‌కు త‌గిన విధంగా బుద్ధి చెప్పాల‌ని సూచించారు. ఐవీరెడ్డి వెంట ప‌లువురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు. 


Back to Top