మాట త‌ప్పిన మోస‌కారి చంద్ర‌బాబు

విశాఖపట్నం (చోడ‌వ‌రం): చ‌ంద్ర‌బాబు తమను న‌మ్మించి మోసం చేశార‌ని మండ‌ల ప‌రిధిలోని మైచ‌ర్ల‌పాలెంకు చెందిన ప‌లువురు మ‌హిళ‌లు, రైతులు వైయ‌స్సార్‌సీపీ చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ సమ‌న్వ‌య‌కర్త క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుగుసుకున్నారు. గ్రామంలో 167 మందికి పింఛ‌న్లు అందేవ‌ని టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత 50 పింఛ‌న్లు నిలిపివేశార‌ని ధ‌ర్మ‌శ్రీ ముందు స్థానికులు వాపోయారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌శ్రీ మాట్లాడుతూ... టీడీపీ ఆరాచ‌క పాల‌న‌కు ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెబుతార‌న్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌పై మార్కులు వేయించారు. 

తాజా ఫోటోలు

Back to Top