మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు

ఆళ్లగడ్డ(ఉయ్యాలవాడ)): అల్లూరు గ్రామంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. పంట భూములు బీడుగా మారుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ప్రజలు వాపోయారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే నిజమేనని నమ్మి మోసపోయామన్నారు. బాబు మోసాలను ఎండగడుతూ  ప్రజా బ్యాలెట్‌ ను పంపిణీ చేశారు. అనంతరం  రామలింగారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటి వరకు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప రాష్ట్రం ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించలేదని ఆరోపించారు.


Back to Top